ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 6:50 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

పౌరసరఫరాల శాఖ మేనేజర్ కు రూ.100 కోట్ల ఆస్తులు..

మహబూబాబాద్,అర్జున్ సమాచారం:

పౌరసరఫరాల శాఖ మేనేజర్ వాసంశెట్టి నరసింహారావు భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది.గతంలో రెండుసార్లు సస్పెండ్ అయిన ఆయనపై తాజాగా ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేసింది.ఖమ్మం,సూర్యాపేట,నిజామాబాద్ జిల్లాల్లో 28 ఎకరాల భూమి,5ప్లాట్లు,ఖమ్మం,హైదరాబాద్ లో భవనాలు,361గ్రా.బంగారం,రూ.33 లక్షల విలువైన వెండి ఉన్నట్లు తేలింది.ఆస్తుల మార్కెట్ విలువ రూ.100CRకు పైగా ఉంటుందని అంచనా.
=====================